SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఇవాళ పర్యటించారు. వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు ను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని వార్డుల్లో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సూచించారు.