WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 9 గ్రామ పంచాయతీలు పూర్తిస్థాయిలో ఏకగ్రీవం కాగా.. భీమదేవరపల్లి మండలం గాంధీనగర్, హాసన్పర్తి మండలం అర్వపల్లి గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు గ్రామాల్లో వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు.