అన్నమయ్య: చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. వివరాల మేరకు రాజంపేట మండలం బోయినపల్లెకు చెందిన వెంకటసుబ్బయ్య (75) ఈనెల 5న రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసినట్లు CI ప్రసాద్ బాబు తెలిపారు.