JN: దేవరుప్పుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నల్లా శ్రీరామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం,రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.