ADB: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వగ్రామమైన జైనథ్ మండలం ఆడ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్‌తో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈసారి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో, గ్రామస్తులు కురుసాంగే నిర్మల సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవమైన వారిని ఎమ్మెల్యే తనయుడు, బీజేపీ నేత పాయల్ శరత్ ఆధ్వర్యంలో సత్కరించారు.