GNTR: తెనాలి పట్టణ పరిధిలోని 25, 2, 4 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జేఆర్.అప్పల నాయుడు శనివారం పర్యటించారు. వార్డుల్లో జరుగుతున్న స్కూల్, కమ్యూనిటీ హాల్, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగ అధికారులకు సూచనలు చేస్తూ, పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.