MDK: రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం శుక్రవారం ఎన్నికల సందడితో కిటకిటలాడింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులకు గుర్తులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుండటంతో నూతన అభ్యర్థులు భారీగా కార్యాలయానికి తరలివచ్చారు. గుర్తుల కేటాయింపులో పారదర్శకత కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.