VZM: రాబోయే ఐదేళ్ల కోసం వ్యక్తిగత, సంఘం, గ్రామస్థాయిలో ప్రణాళికలు తయారుచేసుకుని అమలు చేసుకోవాలని డీఆర్డీఏ ఏపీడీ కె.సావిత్రి అన్నారు. గజపతినగరంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజన్ బిల్డింగ్ శిక్షణ ముగింపులో ఆమె ప్రసంగించారు. అవసరాలు ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని సూచించారు.