SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్లో ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన వసతులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శనివారం పరిశీలించారు. రుద్రంగిలోని హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వసతులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. తహశీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులపై ఆరా తీశారు.