NGKL: డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏబీవీపీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నగర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నవనిర్మాత, దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం అంబేద్కర్ అని పేర్కొన్నారు.