TG: నల్గొండ జిల్లా దేవరకొండలోని శేరిపల్లి రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన, ప్రజావిజయోత్సవ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన రెండేళ్లు పూర్తి సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు.