VZM: తెర్లాం మండలం అప్పలమ్మపేట గ్రామ పంచాయతీ భవనానికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీలను బలోపేతం చేసేందుకు, ప్రజల వద్దకు పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఉపాధి, RGSA మ్యాచింగ్ గ్రాంట్ నిధులు రూ.32లక్షలతో పంచాయతీ భవనం నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.