TPT: సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుజాతపై స్థానిక కోర్టు జడ్జి వెంకట్రాజుకు విద్యార్థులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అటెండెన్స్ తక్కువగా ఉందని ప్రిన్సిపల్ తమ వద్ద పరీక్ష ఫీజులు కట్టించుకోవడం లేదని చెప్పారు. అసభ్య పదజాలంతో ప్రిన్సిపల్ దూషిస్తున్నారని వాపోయారు. ఫిర్యాదును విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తానని జడ్జి చెప్పారు.