పల్నాడు: నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ నారాయణ స్వామిని సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్యశాఖ అధికారి రవి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.