E.G: దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా బాదంపుడి ఇందిర నియమితులయ్యారు. ఈమె యర్నగూడెం గ్రామవాసిగా టీడీపీ పార్టీకి సేవలందిస్తున్నారు. ఈ నియామకానికి గాను కృషి చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఇందిరా కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలో పార్టీ తరఫున అహర్నిశలు శ్రమించి తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని ఆమె పేర్కొన్నారు.