HYD: జీహెచ్ఎంసీ శివారు మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ పూర్తయింది. దీంతో శివారు ప్రాంతాల్లో నిర్మాణ పనులకు అనుమతులు జారీ చేసే ప్రక్రియ కూడా మొదలైంది. మొదటగా జీ+2 భవనాలకు అనుమతులు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. బిల్డ్ నౌ యాప్లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసింది. అయితే అంతకుమించి అనుమతులు తీసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.