SRD: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలో శనివారం ఉదయం 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 95.0% గా ఉంది. చలి తీవ్రత పెరగడంతో ఉదయం వేళలో జనాలు బయట కాలు పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఉదయం వేళ పొగ మంచుతో వెజిబిలిటీ తగ్గటంతో వాహనదారులు హెడ్లైట్లు వేసి మరి వాహనాలను నడుపుతున్నారు.