ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు పవర్ స్టార్. ఎన్నడూ లేని విధంగా పవన్ స్పీడ్ చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ఓజి ఓవర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. పవన్ చేస్తున్న సినిమాల్లో ఈ సినిమా షూటింగ్‌నే టాప్ ప్లేస్‌లో ఉంది. దీనికి కారణం పవన్ భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది.
ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘ఓజి’ తెరకెక్కుతోంది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. సాహో తర్వాత ఏకంగా పవర్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేశాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ఈయన పవన్ ఫ్యాన్ కావడంతో.. ఒక అభిమానిగా ఓజి ఎలివేషన్‌ను ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు అభిమానులు. ముంబై గ్యాంగ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఓజి రెండు, మూడు షెడ్యూల్ కంప్లీట్ చేసేశారు. అయితే ఓజి సినిమానే పవన్ ఎందుకు ఇంత స్పీడ్‌గా షూట్ చేస్తున్నాడనే విషయంలో.. లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్‌గా మారింది.
సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘బ్రో’ సినిమా కోసం.. పవన్ 45 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. 20 నుంచి 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చి.. రోజుకు రెండు కోట్లు తీసుకున్నాడు. అందుకే అన్నింటికంటే ముందుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశాడు. ఇక ఇప్పుడు ఓజి కోసం ఏకంగా వంద కోట్లు తీసుకుంటున్నాడట పవర్ స్టార్. నిన్న మొన్నటి వరకూ ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్లు పారితోషికం అందుకున్న పవన్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో 100 కోట్లు చార్జ్ చేయడం విశేషం. దీంతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టకముందే.. పవన్ రికార్డ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్‌కు భారీ పోటీ ఉందని తెలుస్తోంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. ఈ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.