NRML: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్స్ జరగనున్న ఆరు మండలాల్లో మొత్తం 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మామడ 5, ఖానాపూర్ 5, పెంబి 4, దస్తురాబాద్, లక్ష్మణచందా మండలాల్లో 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడెంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.