SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని అసిస్టెంట్ ఎలక్షన్ అబ్జర్వర్ లచ్చయ్య అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చందుర్తి రైతు వేదికలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ప్రచారంలో భాగంగా చేసే వ్యయం వివరాల నమోదుపై శుక్రవారం అవగాహన కల్పించారు.