NRPT: మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన కోనేరులో స్నానమాచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తలనీలాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు.