AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తల నుంచి ఆయా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించనున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. కాగా వారంలో ఒక రోజు తాను, మంత్రి లోకేష్ పార్టీ ఆఫీసులో ఉంటామని గతంలో చంద్రబాబు తెలిపిన విషయం తెలిసిందే.