KDP: జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. జిల్లాలోని 14 మండలాల్లో అరటి, బొప్పాయి వంటి పంటలు 528.94 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. నష్టపోయిన 718 మంది రైతులకు రూ.1,85,01,250 సబ్సిడీ మంజూరైందని, ఈ పరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి శుక్రవారం తెలిపారు.