MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు కేటాయించిన సాధారణ ఎన్నికల పరిశీలకురాలు భారతీ లకృతి నాయక్ శుక్రవారం మెదక్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఆమెకు వివరించారు.