కెరీర్ స్టార్టింగ్‌లోనే ధృవ్ విక్రమ్ బయోపిక్ తీస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో సాగే మూవీలో రోల్ పోషిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
Dhruv Vikram: సియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌కు (Dhruv Vikram) సంబంధించి కొత్త సినిమా గురించి అప్ డేట్ లేదు. ఏడాదిగా సెలైంట్ అయిపోయాడు. ఏం జరిగందా అని ఆలోచిస్తే.. అసలు విషయం తెలిసింది. బయోపిక్ కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాడట. అందుకే కొత్త సినిమా (cinema) గురించి కానీ, ఇతర అంశాలు తెలియరాలేదు.
కబడ్డీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత మానతీ గణేషన్ (ganeshan) జీవితం ఆధారంగా మూవీ తెరకెక్కుతోంది. సినిమాను డైరెక్టర్ సెల్వరాజ్(selvaraj) తీస్తున్నారు. మానతీ గణేశన్ (ganeshan) పాత్రకి ధృవ్‌ని ఎంపిక చేశారు.. దీంతో గత కొన్ని నెలల నుంచి ధృవ్ (Dhruv) ఆ ప్రాతకి సంబంధించి వర్కవుట్‌లో బిజీగా ఉన్నాడు. నిపుణుల సమక్షంలో కబడ్డీలో (kabaddi) ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ధృవ్ బాడీలో చాలా మార్పులు కనిపిస్తాయని తెలుస్తోంది. మూవీలో తన రోల్ కోసం అవసరమైన వర్కవుట్లను చేస్తూ బిజీగా ఉన్నాడు.
కెరీర్ స్టార్టింగ్‌లోనే ధృవ్ (Dhruv) బయోపిక్ తీస్తున్నాడు. బయోపిక్‌లు ఎక్కువగా బాలీవుడ్లో తీసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది.. టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ తెరకెక్కిస్తున్నారు. సౌత్ సినిమాలను, కథలను బాలీవుడ్ తీయడం అభినందించదగిన విషయం. మానతీ గణేశన్ (ganeshan) మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు (august) నుంచి ప్రారంభం అవుతుందట. గణేశన్ (ganeshan) జీవితాన్ని సినిమాగా తీయాలని ఉండేదని.. ఇప్పుడు ఆ కల (dream) నెరవేరుతోందని చెప్పారు. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ పా రంజిత్ (pa ranjith) నిర్మిస్తున్నారు. కబాలి, కాలా లాంటి హిట్ సినిమాలను పా రంజిత్ తీశారు.