TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 20,614 కోట్ల రుణమాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత సర్కారు పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము లక్షలాది కార్డులిచ్చామని తెలిపారు. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. ప్రొ. జయశంకర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని గుర్తుచేశారు.