BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో ఈ నెల 11న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బు ఆశించకుండా సరైన నాయకుడిని సర్పంచ్‌గా గెలిపించాలని విన్నర్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కాడపాక చంద్రమౌళి పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లకు డబ్బు పంచితే ప్రతి పౌరుడు అడ్డుకొని అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు.