గుంటూరు రూరల్ మండలం గొర్లవారిపాలెంలో బ్లాక్ బర్లీ పొగాకు పంట విరామంపై అవగాహన నిర్వహించారు. రబీలో జీవో 740 ప్రకారం నల్ల బర్లీ సాగుపై నిషేధం ఉందని మండల వ్యవసాయ అధికారి కిషోర్ తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే టాస్క్ ఫోర్స్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రైతులు బదులుగా శనగ, మినుము, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.