మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు దుప్పట్లను అందజేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి కోరారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు దుప్పట్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరగతిన దుప్పట్లను అందించాలని డిమాండ్ చేశారు.