GDL: గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇటీవల వడ్ల లారీలు ఇరుక్కుపోయి, అతికష్టం మీద వాటిని బయటికి తీశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ప్రమాదకరంగా మారడం పట్ల వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.