MBNR: దత్తాత్రేయస్వామి జయంతి సందర్భంగా గురువారం పాలమూరులోని తూర్పు కమాన్ దగ్గర దత్తాత్రేయ ఆలయంలో జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆలయాన్ని దర్శించుకోని, ప్రత్యేక పూజలు చేశారు. దత్తాత్రేయస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అంతకుముందు అర్చక బృందం ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.