NLR: కండలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 6,000 క్యూసెక్కుల ఇన్ఫో ఉండగా 11 గంటలకు 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండలేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా ఇన్ఫో కొనసాగుతుండడంతో ప్రస్తుతం కండలేరులో నీటిమట్టం 60 టీఎంసీలకు చేరింది.