SRPT: మద్దిరాల మండల కేంద్రంలో అక్రమ మద్యం రవాణా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కుంటపల్లి ఎక్స్-రోడ్ వద్ద ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కార్టన్ల క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16.20 లీటర్ల మద్యం విలువ సుమారు రూ. 8,100 ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.