MBNR: అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. అకౌంట్లో డబ్బులు త్వరగా పడేవిధంగా చూడాలన్నారు.