AP: విశాఖ బీచ్లో నిర్వహించిన ర్యాలీలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. మహిళలకు సురక్షిత నగరంగా విశాఖకు గుర్తించిన సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. మహిళల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖ రోజురోజుకూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. శక్తి టీమ్స్, శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు.