BDK: చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా పోలీసు వారు ఇవాళ పట్టుకున్నారు. చంద్రుగొండ పోలీసు వారు వాహన తనిఖీలలో భాగంగా గూడ్స్ క్యారియర్ లారీని ఆపీ తనిఖీ చేయగా రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలిపారు.