BHNG: ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం గురువారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కంతి మధు గ్రామంలో సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు.