చిత్తురు నుంచి నిండ్ర మండలం వరకు రోడ్లు చాలా దారుణంగా తయారయ్యాయి. గతంలో ఈ ప్రాంత పరిధిలో చాలా యాక్సిడెంట్ జరిగాయని స్థానికులు తెలిపారు. పోయిన ప్రాణాలు తీసుకురాలేం కానీ, రోడ్లు బాగుచేయడం వల్ల ప్రాణాలు పోకుండా ఉంటాయని వారు వేడుకుంటున్నారు. అధికారులు స్పందించిన ఈ రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.