మెదక్: జిల్లా కేంద్రం గోల్ బంగ్లాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిణి విజయ, సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.