కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని, భారత చట్టాలను ఉల్లంఘించారని ఓ కర్ణాటక నేత వేసిన పిటిషన్ను రాయబరేలీ MP-MLA కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై డిసెంబర్ 5న విచారణ జరగనుంది. ఎంపీగా ఉన్న రాహుల్కు ఈ వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది.