ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో భారీగా కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ అభివృద్ధి హామీలతో రోజూ పోస్టులు పెట్టి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. రోడ్లు, డ్రైనేజీ, శుద్ధి నీరు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, దేవాలయాల అభివృద్ధి వంటి మేనిఫెస్టోలతో వీడియోలు, మీమ్స్, చమత్కార స్లోగన్లు వైరల్ అవుతున్నాయి.