తన డ్రీమ్ ప్రాజెక్టు ‘వెల్పరి’పై దర్శకుడు శంకర్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఆయన.. ప్రభాస్, మహేష్ బాబులను సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అవతార్ లెవల్ టెక్నాలజీ, భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ మూవీకి వారిద్దరిలో ఒకరిని తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాడట. ఇక ఈ సినిమా 2026 జూన్ నాటికి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.