MDK: హోంగార్డు రైజింగ్ డేను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో హోంగార్డు సిబ్బందికి క్రీడా పోటీలను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రారంభించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు.