AP: రాష్ట్రంలో వారం రోజులుగా తుఫాన్ ప్రభావంపై అప్రమత్తం అయినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం తుఫాన్ బలహీనపడి పుదుచ్చేరి వద్ద తీరం దాటిందని చెప్పారు. మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.