2025లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల, దర్శకుల జాబితాను IMDB ప్రకటించింది. ‘సైయారా’ స్టార్స్ అహాన్ పాండే, అనీత్ పడ్డా, ఆమిర్ ఖాన్ టాప్ 3లో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇషాన్ ఖట్టర్, లక్ష్య, రష్మిక మందన్న, కళ్యాణి ప్రియదర్శన్, త్రిప్తి డిమ్రి, రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి ఉన్నారు. దర్శకుల జాబితాలో మోహిత్ సూరి, ఆర్యన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ టాప్ 3లో నిలిచారు.