NLG: మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులను మ. ఒంటిగంట తర్వాతనే తెరవడం, సా. 6 నుండి పర్మిట్ రూములకు అనుమతి కొనసాగుతుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనధికార ఆదేశాలను వైన్ షాపుల యజమానులు పాటిస్తూ సహకరిస్తున్నారు. గ్రామస్తులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఊరి బయటనే మద్యం షాపులను ప్రారంభించారు. ఎమ్మెల్యే నిర్ణయంను నియోజకవర్గ ప్రజలు హర్షిస్తున్నారు.