సత్యసాయి: ధర్మవరం రూరల్లోని ఓ ఇంటి ముందు ఏర్పడిన భారీ గుంట సమస్య మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి వచ్చింది. ఢిల్లీలో ఉన్నప్పటికీ, సమస్య తీవ్రతను గుర్తించి మంత్రి తెల్లవారుజామున 4 గంటలకే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు హరీష్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి పర్యవేక్షించి, పైపు లీకేజీని సరిచేయించారు.