AKP: ఇటీవల ఎన్నికైన రెడ్‌క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గంలోని 11 మంది సభ్యులు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయ్ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా పని చేయాలని కలెక్టర్ సూచించారు. చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను సభ్యులు వివరించారు. భేటీలో ఛైర్మన్ శేషు కుమార్, వైస్ ఛైర్మన్ పప్పల సురేష్, కృష్ణంరాజు పాల్గొన్నారు.