AP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, ప్రజలతో మమేకంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పార్టీ చరిత్ర, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడికి తెలియాలని అన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొందో అవగాహన కల్పించినట్లు చెప్పారు.