SRPT: దూరాజ్పల్లి ఎక్స్ రోడ్ వద్ద చివ్వెంల పోలీసులు తనిఖీల్లో ఎర్టిగా కారులో తరలిస్తున్న లక్ష రూపాయల విలువైన 528 క్వార్టర్ బాటిల్స్ ను సీజ్ చేశారు. అనుమతులు లేని 11 ఇంపీరియల్ బ్లూ కాటన్లను స్వాధీనం చేసుకుని, కారు డ్రైవర్ ధారవత్ సైదా, కొనుగోలుదారు ధరవాత్ నాగుపై కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై వీ. మహేశ్వర్ హెచ్చరించారు.